KTR: కాంగ్రెస్ నేతలు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు: కేటీఆర్
KTR: తెలంగాణ ప్రభుత్వానికి ఏ భాష పట్ల విద్వేషం లేదన్నారు కేటీఆర్.;
KTR: తెలంగాణ ప్రభుత్వానికి ఏ భాష పట్ల విద్వేషం లేదన్నారు కేటీఆర్. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బహదూర్‌పల్లిలో వొకేషనల్ కాలేజీకి శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. మన ఊరు-మన బడిపై కాంగ్రెస్‌వి పచ్చి అబద్ధాలన్నారు. ఉత్తమ్, మధుయాష్కిలవి మిడిమిడి జ్ఞానమంటూ విమర్శించారు. గురుకుల పాఠశాలల నుంచి అద్భుతమైన విద్యార్థులు వస్తున్నారని చెప్పారు. 67 ఏళ్లలో గత ప్రభుత్వాలు చేయలేని పనులు టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు అర్ధసత్యాలు ప్రచారం చేస్తున్నాయన్నారు.