KTR : యూకేలో ప్రారంభోత్సవానికి కేటీఆర్ కు ఆహ్వానం

Update: 2025-05-17 07:15 GMT

మాజీమంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ఆహ్వానం అందింది. లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ -ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ యూకేలోని -వార్విక్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటు చేసిన తమ నూతన కేంద్రా న్ని ప్రారంభించాల్సిందిగా కేటీఆర్ ను ఆహ్వానించింది.

ప్రపంచంలోనే అతిపెద్దదైన, అత్యంత విలువైన కారు బ్రాండ్ అయినా మైక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి ప్రముఖ ఆటో దిగ్గజాలకు సేవలు అందిస్తోంది. గత 15 ఏళ్లకుపైగా ఈ సంస్థ ఆటోమోటివ్ పరిశ్రమలో అనేక ఉత్పత్తులను తన సేవలను అందిస్తూ కొనసాగుతోంది. తమ నూతన కేంద్రం ద్వారా ఆటోమోటివ్ డెవల ప్మెంట్, టెస్టింగ్ కార్యకలాపాలను మరింత విస్తరించనున్నట్లు పీడీఎస్ఎల్ సంస్థ పేర్కొంది. ఈ నెల 30వ తేదీన యూకేలోని వార్విక్ యూనివర్శిటీ సైన్స్ -పార్క్ లోని పరిశోధన కేంద్రాన్ని కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటుచేసిన ఈ కేంద్రాన్ని కేటీఆర్ ప్రారంభిం చాలని సంస్థ శుక్రవారం ఆహ్వానం పంపింది. తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ, ఇండస్ట్రీ యల్ ఇన్నోవేషన్లో అగ్రగామిగా తీర్చిదిద్దిన కేటీఆర్ నాయకత్వాన్ని గుర్తించిన -పీడీఎస్ఎల్, తమ ఇన్నోవేషన్ కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభిం చుకోవడం గర్వకారణంగా భావిస్తోంది. ఈ క్రమంలోనే ఆయన ఈ నెల 30న లండన్ చేరుకుని సంస్థను ప్రారంభించనున్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తికి గౌరవం దక్కడం రాష్ట్ర ఖ్యాతికి చిహ్నంగా భావిస్తున్నారు.

Tags:    

Similar News