రాజకీయ లబ్దికోసం సాగునీటి ప్రాజెక్టులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆక్షేపించారు. మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన ఆయన ఆల్మట్టి ఎత్తు పెంచొద్దని సుప్రీంకోర్టు స్టే ఉందని, ప్రాజెక్టు ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకమని పునరుద్ఘాటించారు. ఎట్టి పరిస్థితుల్లో కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచకుండా అడ్డుకుంటామని....... సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేస్తామని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయంజరిగిందని ఉత్తమ్ ఆక్షేపించారు. ఇవాళ దిల్లీలో..... కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసిఈసారి రాష్ట్రం నుంచి 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంసేకరించాలని కోరనున్నట్లు చెప్పారు. 52 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు... కేంద్రప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిందని, మిగిలిన ధాన్యాన్ని తీసుకోవాలని కోరతానని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని గోదాములు, రైస్ మిల్లుల్లో నిండిపోయి ఉన్న ధాన్యాన్ని తరలించేందుకు 300 రైళ్లు ఇవ్వాలని...... విజ్ఞప్తి చేయనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అంతకుముందు జలసౌధలో అధికారులతో సమావేశమైన మంత్రి ఉత్తమ్ ... తుమ్మిడిహట్టి వద్ద ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుపై సవరించిన డీపీఆర్ ..... సిద్ధం చేయాలని ఆధికారులను ఆదేశించారు. మంత్రివర్గ ఆమోదం తర్వాత SLBC...... సొరంగం పనులు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. సాగునీటి వినియోగదారుల సంఘాల ఏర్పాటు ప్రతిపాదనను.......... పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సంఘాల ద్వారా చెరువులు, కాల్వల క్రమబద్ధమైన నిర్వహణ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత నీటి వినియోగదారుల సంఘాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొదట చెరువులతో ప్రారంభించి క్రమంగా పెద్ద ప్రాజెక్టులకు విస్తరిస్తామని ఉత్తమ్ వివరించారు.