KTR: హైదరాబాద్ పేరు మార్పుపై మరోసారి వివాదం.. బీజేపీ నేతలకు కేటీఆర్ కౌంటర్..
KTR: జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పలువురు బీజేపీ నేతలు..తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను మారుస్తామంటూ కామెంట్స్ చేశారు;
KTR: హైదరాబాద్ పేరు మార్పుపై మరోసారి వివాదం మొదలైంది. హైదరాబాద్ వేదికగా జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పలువురు బీజేపీ నేతలు..తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్‌ను మారుస్తామంటూ కామెంట్స్ చేశారు. జార్ఖండ్ మాజీ సీఎం రఘుబార్ దాస్ సైతం హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. బీజేపీ నేతలు టార్గెట్‌గా సెటైర్లు వేశారు. హైదరాబాద్ పేరు మార్పు కంటే ముందుగా అహ్మదాబాద్ పేరు అదానిబాద్‌గా ఎందుకు మార్చరంటూ చురకలంటించారు. రఘుబార్‌దాస్‌ను ఉద్దేశించి ఈ జుమ్లా జీవి ఎవరంటూ వ్యంగ్యంగా స్పందించారు.