KTR : కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన కేటీఆర్..

Update: 2025-09-27 09:49 GMT

తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందనే విషయాన్ని చాటిచెప్పేందుకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేసింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్డును ఆవిష్కరించారు.

తెలంగాణలోని ప్రతీ ఇంటికీ ఈ బాకీ కార్డును చేరుస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలందరికీ గుర్తుచేస్తామని, తమపై కేసులు పెట్టినా వెనుకాడబోమని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసి, తమ బాకీని వసూలు చేసుకోవాలని ఈ సందర్భంగా కేటీఆర్ పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు బాకీ పడిన హామీలు, బకాయిల వివరాలు ఈ కార్డులో పొందుపరిచారు

మహిళలకు రూ.2500 హామీ: ఒక్కొక్కరికి రూ.55 వేలు బాకీ.

వృద్ధులకు పెన్షన్ ఒక్కొక్కరికి రూ.44 వేలు బాకీ

వికలాంగులకు పెన్షన్ ఒక్కొక్కరికి రూ.44 వేలు బాకీ

షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ఆడబిడ్డల పెళ్లిళ్లకు తులం బంగారం హామీ

నిరుద్యోగులు 2 లక్షల ఉద్యోగాల హామీ

విద్యార్థినులకు స్కూటీ హామీ.

విద్యా భరోసా కార్డ్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు హామీ

Tags:    

Similar News