KTR : కరువు కాదు.. కాంగ్రెస్ కాటేసింది - కేటీఆర్

Update: 2025-07-14 12:45 GMT

రేవంత్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. రైతులు, ప్రజా సమస్యలపై స్పందిస్తూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నెలకొన్న కరువుపై కేటీఆర్ ట్వీట్ చేశారు. కరువు కాటేయడం లేదు.. కాలువల్లో నీళ్లు పారించకుండా కాంగ్రెస్ కాటేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయకుండా కక్షగట్టిన రేవంత్ నిర్లక్ష్యం మూలంగా కాలువల్లో నీళ్లకు బదులు రైతుల కన్నీళ్లు పారుతున్నాయని చెప్పారు.

‘‘అద్దాలమేడలో ఊరేగుతున్న అబద్దాల కాంగ్రెస్ మూలంగా అంధకారంలో తెలంగాణ రైతన్న ఆందోళన చెందుతున్నాడు. దశాబ్దాల పాలనలో దండగ చేసిన వ్యవసాయాన్ని దశాబ్ద బీఆర్ఎస్ పాలనలో పండగ చేస్తే ..ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరిగి దండగ చేశారు. కానీ పండుగల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఊరేగుతున్నది’’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ మేరకు పలు వార్తల క్లిప్పింగులను ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.

Tags:    

Similar News