KTR: కవితపై మాట్లాడేదీ ఏమీ లేదు: కేటీఆర్

వెనక్కి తగ్గే ముచ్చటే లేదు: కవిత

Update: 2025-09-09 05:00 GMT

బీ­ఆ­ర్ఎ­స్ పా­ర్టీ నుం­చి కల్వ­కుం­ట్ల కవిత సస్పె­న్ష­న్.. తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో చర్చ­నీ­యాం­శం­గా మా­రిం­ది. ఇప్ప­టి­కే ఆయా పా­ర్టీ­లు ఈ వి­ష­యం­పై రక­ర­కా­లు­గా తమ అభి­ప్రా­యా­ల­ను వ్య­క్తం చే­స్తు­న్నా­రు. అయి­తే తె­లం­గాణ భవ­న్‌­లో ని­ర్వ­హిం­చిన మీ­డి­యా సమా­వే­శం­లో కవిత సస్పె­న్ష­న్‌­పై ఓ జర్న­లి­స్ట్ కే­టీ­ఆ­ర్‌­ను ప్ర­శ్నిం­చ­గా.. ఆయన ఆస­క్తి­కర సమా­ధా­నం చె­ప్పా­రు. కవిత సస్పె­న్ష­న్ వి­ష­యం పా­ర్టీ­లో చర్చిం­చి తీ­సు­కుం­ద­ని స్ప­ష్టం చే­శా­రు. పా­ర్టీ­కి నష్టం చే­కూ­ర్చిన ప్ర­తి ఒక్క­రి­కీ ఇదే రూల్ వర్తి­స్తుం­ద­ని తె­లి­పా­రు. కవి­త­పై చర్చ­లు తీ­సు­కు­న్నాక ఇక మా­ట్లా­డే­ది ఏం లే­ద­ని కే­టీ­ఆ­ర్ సూ­టి­గా సమా­ధా­నం చె­ప్పా­రు. కాళే­శ్వ­రం ప్రా­జె­క్టు­పై ఆధా­ర­ప­డి గో­దా­వ­రి జలాల పథ­కా­ని­కి శం­కు­స్థా­పన చే­స్తు­న్నా­ర­ని చె­ప్పా­రు.

వెనక్కి తగ్గే ముచ్చటే లేదు: కవిత

స్థా­నిక సం­స్థల ఎన్ని­కల సం­ద­ర్భం­గా కాం­గ్రె­స్ పా­ర్టీ బీ­సీ­ల­కు ఇచ్చిన ఏ ఒక్క హా­మీ­ని అమలు చే­య­కుం­డా మోసం చే­స్తోం­ద­ని మాజీ ఎంపీ కల్వ­కుం­ట్ల కవిత తీ­వ్ర ఆరో­ప­ణ­లు చే­శా­రు.తె­లం­గాణ జా­గృ­తి కా­ర్యా­ల­యం­లో 70కి పైగా బీసీ కు­లాల నా­య­కు­ల­తో ఆమె భేటీ అయ్యా­రు. బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్ల సా­ధ­న­కు అను­స­రిం­చా­ల్సిన వ్యూ­హా­ల­పై ఈ సమా­వే­శం­లో ప్ర­ధా­నం­గా చర్చిం­చా­రు. కా­మా­రె­డ్డి బీసీ డి­క్ల­రే­ష­న్ అమలు చే­య­కుం­డా కాం­గ్రె­స్ పా­ర్టీ బీ­సీ­ల­ను మోసం చే­స్తోం­ద­ని ఆగ్ర­హం వ్య­క్తం చే­శా­రు. రా­హు­ల్ గాం­ధీ, ప్రి­యాంక గాం­ధీ ఇంత వరకు తె­లం­గాణ బీ­సీల రి­జ­ర్వే­ష­న్ల అం­శా­న్ని ఎం­దు­కు పా­ర్ల­మెం­ట్‌­లో ప్ర­స్తా­విం­చ­లే­దో ప్ర­జ­ల­కు సమా­ధా­నం చె­ప్పా­ల­ని డి­మాం­డ్ చే­శా­రు. బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు కల్పిం­చిన తర్వా­తే స్థా­నిక సం­స్ధల ఎన్ని­క­లు ని­ర్వ­హిం­చా­లన్నారు.

రేవంత్‌రెడ్డికి సిగ్గుందా? : కేటీఆర్

తె­లం­గాణ సీఎం రే­వం­త్ రె­డ్డి­పై బీ­ఆ­ర్ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్ మరో­సా­రి వి­మ­ర్శ­లు గు­ప్పిం­చా­రు. రా­ష్ట్రం­లో­కి మహా­రా­ష్ట్ర పో­లీ­సు­లు వచ్చి నెలల తర­బ­డి కా­ర్మి­కు­ల­లా పని చేసి... రూ.12 వేల కో­ట్ల డ్ర­గ్స్ పట్టు­కు­న్నా­ర­న్నా­రు. 21 నెలల నుం­చి ఆ డ్ర­గ్స్ కం­పె­నీ­పై కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం ఏం చర్య­లు తీ­సు­కో­లే­దం­టే, రే­వం­త్ రె­డ్డి­కి ఏమైన ము­డు­పు­లు అం­దా­యా? అని ప్ర­శ్నిం­చా­రు. హోం­మం­త్రి శాఖ, ఈగల్ టీం, హై­డ్రా టీం ఏం చే­స్తోం­ది? , సీ­ఎం­కు సి­గ్గుం­దా? అని క్వ­శ్చ­న్ చే­శా­రు.

Tags:    

Similar News