KTR: ప్రధాని మోదీపై కేటీఆర్ హాట్ ట్వీట్.. అసమానత్వానికి పెట్టింది పేరంటూ..
KTR: మోదీ పర్యటనపై టీఆర్ఎస్ ట్వీట్ల యుద్ధం ఆగడం లేదు.;
KTR: మోదీ పర్యటనపై టీఆర్ఎస్ ట్వీట్ల యుద్ధం ఆగడం లేదు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ప్రధాని మోదీని ఘాటుగా విమర్శించారు. అసమానత్వానికి పెట్టింది పేరైన నరేంద్ర మోదీ.. సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారంటూ ట్వీట్ చేశారు. సమానత్వాన్ని దూరం చేసిన వాళ్లు సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించడం చూసి.. వ్యంగ్యం కూడా కొన్ని కోట్ల సార్లు మరణించిందన్నారు మంత్రి కేటీఆర్.
కేటీఆర్ కామెంట్‌కు మద్దతుగా బాల్క సుమన్ సైతం ట్వీట్ చేశారు. వెయ్యేళ్ల ముందు సమానత్వం కోసం పోరాడిన చరిత్ర.. ఇప్పుడు కూడా నా దేశంలో కొనసాగడం దురదృష్టకరం అంటూ కామెంట్ చేశారు. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడని ప్రధాని.. సమానత్వం గురించి మాట్లాడడం వింతగా ఉందన్నారు. తాజా బడ్జెట్‌ను పరిశీలిస్తే.. తెలంగాణపై కేంద్ర వివక్ష ఎంతలా ఉందో కనిపిస్తుందని ట్వీట్ చేశారు.
టీఆర్‌ఎస్ ట్వీట్లకు కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. సింపుల్‌గా బర్నాల్ మూమెంట్ అంటూ కామెంట్ పెట్టారు. టీఆర్ఎస్ నేతలు బర్నాల్ రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ కౌంటర్ వేశారు.