KTR : బీజేపీపై కేటీఆర్ ట్విట్టర్ వార్.. మోడీ ఈడీ అంటూ ఫైర్..
KTR : బీజేపీపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.;
KTR : బీజేపీపై వరుస ట్వీట్లతో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్. ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షున్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్‌గా నియమించడంపై తీవ్రంగా స్పందించారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే.. మోదీ-ఈడీ అనే విషయం ఇప్పుడు అర్థమైందంటూ కామెంట్ చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఈడీ విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన కామెంట్లకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
కాస్త కఠినంగా ఉన్నా సరే వాస్తవం చెబుతున్నానంటూ.. ఇక్కడ రెండు ఇండియాలు ఉన్నాయంటూ ఓ ట్వీట్ పెట్టారు. పేదరికంలో ప్రపంచానికే రాజధానిగా ఉన్న నైజీరియాను ఇండియా ఓవర్‌టేక్ చేసిందని కామెంట్ చేశారు. ఇదే దేశంలో బిల్‌గేట్స్‌ను క్రాస్‌చేసి ప్రపంచ నాలుగవ కుబేరుడిగా అదానీ ఆవిర్భవించడాన్నీ ప్రస్తావించారు.
సీనియర్ సిటిజన్లకు ఇకపై రైలు ప్రయాణంలో రాయితీలు ఉండబోవంటూ రైల్వే శాఖ చేసిన ప్రకటనపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. వృద్ధుల పట్ల దయ చూపడమే కాదు వారి పట్ల బాధ్యతగా ఉండడం మన విధి అంటూ కామెంట్ చేశారు. రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం అత్యంత విచారకరమని, వృద్ధులకు రాయితీలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.