మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్
మహబూబ్‌నగర్ శ్రీనివాస కాలనీలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లిన కేటీఆర్.. నారాయణ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.;
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తండ్రి నారాయణ గౌడ్ మృతిపట్ల మంత్రి కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. మహబూబ్‌నగర్ శ్రీనివాస కాలనీలో ఉన్న శ్రీనివాస్ గౌడ్ ఇంటికి వెళ్లిన కేటీఆర్.. నారాయణ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. నారాయణ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు మంత్రి కేటీఆర్. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, తదితరులు ఉన్నారు. కేటీఆర్ రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.