KTR: 'అలా చేస్తే లీగల్ నోటీసులు పంపుతా..' బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్..
KTR: కేటీఆర్, బండి సంజయ్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై బండి సంజయ్ ట్వీట్ చేశారు.;
KTR: మంత్రి కేటీఆర్, బండి సంజయ్ మధ్య ట్విట్టర్ వార్ జరుగుతోంది. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై బండి సంజయ్ ట్వీట్ చేశారు. కేటీఆర్ నిర్వాకం వల్లే 27 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలంటూ ట్వీట్ చేశారు. దీనిపై కనీసం ముఖ్యమంత్రి స్పందించలేదని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. బండి సంజయ్ ట్వీట్‌పై రియాక్ట్ అయిన మంత్రి కేటీఆర్... ఆయనకు వార్నింగ్ ఇచ్చారు.
నిరాధారమైన ఆరోపణలు చేస్తే లీగల్ నోటీసులు పంపుతానంటూ ట్వీట్ చేశారు. బాధ్యతారహితమైన ఆరోపణలు సరికాదన్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ వార్నింగ్ ఇచ్చారు. బండి సంజయ్ దగ్గర సాక్ష్యం ఉంటే ప్రజల్లో నిరూపించాలని.. లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ ట్వీట్ చేశారు మంత్రి కేటీఆర్.