KTR: ప్రధాని మోదీ పాలనలో సబ్‌కా సత్తెనాష్ అయింది - కేటీఆర్
KTR: పెట్రోధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం.. ప్రజల్ని తీవ్ర అవస్థలు పడేలా చేస్తోందని ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.;
KTR (tv5news.in)
KTR: పెట్రోధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం.. ప్రజల్ని తీవ్ర అవస్థలు పడేలా చేస్తోందని ఐటీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పెట్రో ధరల పెంపుపై కేంద్రానికి మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. రోజువారీగా పెరుగుతున్న పెట్రో రేట్లు, నిత్యావసరాల ధరలు అకాశాన్ని దాటి అంతరిక్షాన్ని చేరుకుంటున్నాయని విమర్శించారు. ధరలను అదుపు చేయడంతో విఫలమైన మోదీ ప్రభుత్వం.. అందుకు చెపుతున్న కారణాలన్నీ అబద్దాలేనని ఆరోపించారు. అమెరిక, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్ లో ఉన్న ధరలు పెరుగుతున్నాయని చెపుతున్న కేంద్రమంత్రులు.. అక్కడ లీటర్ పెట్రోల్ రేట్ మనకంటే తక్కువే ఉందన్న సంగతి ప్రజలకు తెలియకుండా దాస్తున్నారని విమర్శించారు.