Laldarwaja Bonalu : ఘనంగా ముగిసిన లాల్‌దర్వాజ బోనాలు..
Laldarwaja Bonalu : హైదరాబాద్‌లోని పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ఘనంగా ముగిసాయి.;
Laldarwaja Bonalu : హైదరాబాద్‌లోని పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు ఘనంగా ముగిసాయి. బోనాల ఉత్సవాల్లో భాగంగా చివరి ఘట్టమైన భవాని రథయాత్రను కన్నులు పండువగా నిర్వహించారు. ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో యాత్ర కొనసాగింది.
రథయాత్రను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాలతో ఆ ప్రాంతం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. భక్తులకు స్వాగతం పలుకుతూ ఎంఐఎం నేతలు వేదికను వేర్పాటుచేశారు. శాలిబండ నుంచి చార్మినార్ మీదుగా పురాణపుల్ వరకు భవానీ రథయాత్ర సాగింది.