LB Nagar Flyover: ఎల్బీ నగర్‌ ఫ్లైఓవర్.. ఇక విజయవాడకు హ్యాపీగా

LB Nagar Flyover: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా నిర్మించిన ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు శనివారం ప్రారంభించనున్నారు.

Update: 2023-03-25 09:54 GMT

LB Nagar Flyover: స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డిపి)లో భాగంగా నిర్మించిన ఎల్‌బి నగర్ ఆర్‌హెచ్‌ఎస్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటి రామారావు శనివారం ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు, ఫ్లైఓవర్ విశేషాలను, కొన్ని చిత్రాలను మంత్రి ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు. ఈ ఫ్లైఓవర్ పొడవు 760 మీటర్లు, వెడల్పు 12 మీటర్లు, మూడు లేన్లతో ఉందని మంత్రి కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది రూ.32 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. ట్రాఫిక్ అడ్డంగులు లేకుండా సిగ్నల్ రహితంగా ఉంది. ఇది విజయవాడ హైవే నుండి హైదరాబాద్‌కు ఎల్‌బి నగర్ వద్ద సాఫీగా ప్రయాణించేలా చేస్తుంది.

Tags:    

Similar News