జగిత్యాల జిల్లా రంగారావుపేట గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌్ ప్రాంతంలో ఓ కుక్కను చిరుత చంపి తిన్నట్టు గ్రామస్థులకు ఆనవాళ్లు కనిపించాయి. వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారమిచ్చారు. దీంతో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సయ్యద్ సత్తార్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శునకాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జంతువు కాలి ముద్రలు కనబడటంతో సేకరించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఇవాళ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించనున్నారు. కాలి ముద్రలను బట్టి అది చిరుత పులిగానే భావిస్తున్నారు. ఎందుకైనా సరే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.