Telangana : తెలంగాణలో స్థానిక ఎన్నికల సందడి.. త్వరలోనే నోటిఫికేషన్!

Update: 2025-07-15 11:30 GMT

తెలంగాణలో అందరూ ఎదురుచూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలకు త్వరలోనే నగరా మోగనుంది. ఈ మేరకు గ్రామాలలో హడావిడి మొదలు కాగా...త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే పనిలో పడ్డారు అధికారులు. అందుకు సంబంధించినా గ్రౌండ్ వర్క్ ను ముందుగా పూర్తి చేస్తున్నారు.

గత సంవత్సర కాలంగా గ్రామాలలో సర్పంచులు లేకపోవడంతో.. ప్రత్యేక అధికారులతో నే పరిపాలనను కొనసాగిస్తున్నారు. ఆశావహులు ఎపుడు ఎన్నికలు వస్తాయా అని గత సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుగా ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. ఈ మేరకు అధికారులకు సూచనలు కూడా చేసింది. ఎంపీటీసీ ఎన్నికల తర్వాత సర్పంచ్ ఎన్నికలు ఉండేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది డేటా ను సిద్ధం చేయాలని కలెక్టర్ల ను ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో నమోదైన రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్, ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బంది వివరాలను మరోసారి పరిశీలించాలని ఈ సందర్భంగా ఈసీ సూచించినట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలోని జిల్లా, రెవెన్యూ, డివిజన్, మండలం, పంచాయతీలతో పాటు వార్డుల సంఖ్య ఆధారంగా..పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో త్వరలోనే పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News