LOCAL WAR: పంచాయతీల్లో కాంగ్రెస్‌దే పై"చేయి"

4231 సర్పంచులకుగాను 2367 హస్తగతం.. 58.5 శాతానికిపైగా స్థానాలు కాంగ్రెస్ కైవసం.. 26 శాతం సీట్లను గెలుచుకున్న బీఆర్‌ఎస్‌.. గులాబీ ఖాతాలో 1,055 పంచాయతీలు

Update: 2025-12-12 03:00 GMT

తె­లం­గాణ పల్లె­పో­రు­లో హస్తం సత్తా చా­టిం­ది. గు­రు­వా­రం జరి­గిన తొ­లి­వి­డత గ్రామ పం­చా­య­తీ ఎన్ని­క­ల్లో అర్ధ­రా­త్రి 2 గంటల వరకు వె­ల్ల­డైన ఫలి­తాల మే­ర­కు ఏక­గ్రీ­వా­ల­తో కలు­పు­కొ­ని అధి­కార కాం­గ్రె­స్‌ పా­ర్టీ మద్ద­తు­దా­రు­లు 2,383 సర్పం­చి స్థా­నా­ల్లో వి­జ­య­దుం­దు­భి మో­గిం­చా­రు. సి­ద్ది­పేట మి­న­హా మి­గి­లిన జి­ల్లా­ల్లో కాం­గ్రె­స్‌ పా­ర్టీ మె­జా­రి­టీ స్థా­నా­ల­ను కై­వ­సం చే­సు­కుం­ది. పలు చో­ట్ల గట్టి­పో­టీ ఇచ్చిన ప్ర­తి­ప­క్ష భారత రా­ష్ట్ర సమి­తి 1,146 పం­చా­య­తీ­ల­ను గె­లు­పొం­దిం­ది. స్వ­తం­త్ర అభ్య­ర్థు­లు 455 చో­ట్ల వి­జ­యం సా­ధిం­చా­రు. వీ­టి­లో సీ­పీ­ఎం 14, సీ­పీఐ 16 చో­ట్ల­కు పైగా గె­లి­చా­యి. భా­జ­పా రెం­డు­వం­దల లోపు స్థా­నా­ల­కు పరి­మి­త­మైం­ది. శీ­తా­కా­ల­మై­నా ఉదయం ఆరు గంటల నుం­చే పో­లిం­గు కేం­ద్రాల వద్ద ఓట­ర్లు బా­రు­లు తీ­రా­రు. 7 గంటల నుం­చి ఓటు­హ­క్కు వి­ని­యో­గిం­చు­కు­న్నా­రు. పలు­చో­ట్ల మహి­ళ­లు చంటి పి­ల్ల­ల­తో.. కొం­ద­రు వృ­ద్ధు­లు అం­బు­లె­న్స్‌­లో పో­లిం­గ్‌ కేం­ద్రా­ని­కి వచ్చా­రు. తొ­లి­వి­డత ఎన్నిక జరి­గే ప్రాం­తా­ల్లో 396 పం­చా­య­తీ­లు ఏక­గ్రీ­వం కాగా.. 3,834 సర్పం­చి, 27,678 వా­ర్డు సభ్యుల స్థా­నా­ల­కు పో­లిం­గ్‌ జరి­గిం­ది. 84.28 శాతం ఓటిం­గ్‌ నమో­దైం­ది. అత్య­ధి­కం­గా యా­దా­ద్రి భు­వ­న­గి­రి జి­ల్లా­లో 92.88 శాతం పో­లిం­గ్‌ జర­గ్గా... భద్రా­ద్రి కొ­త్త­గూ­డెం జి­ల్లా­లో అత్య­ల్పం­గా 71.79 శాతం ఓట్లు పో­ల­య్యా­యి.  మాజీ సీఎం కే­సీ­ఆ­ర్‌, మాజీ మం­త్రి హరీ­శ్‌­రా­వు ప్రా­తి­ని­ధ్యం వహి­స్తు­న్న సి­ద్ది­పేట జి­ల్లా­లో మా­త్రం బీ­ఆ­ర్‌­ఎ­స్‌ తన ఆధి­ప­త్యా­న్ని చా­టు­కుం­ది. మొ­త్తం­గా కాం­గ్రె­స్‌ 58.5 శాతం గె­లు­పొం­ద­గా, బీ­ఆ­ర్‌­ఎ­స్‌ 26 శాతం సీ­ట్ల­ను గె­లి­చిం­ది. ఇక బీ­జే­పీ ప్ర­భా­వం నా­మ­మా­త్ర­మే అయిం­ది.

పం­చా­య­తీ ఎన్ని­క­లు పా­ర్టీ రహి­త­మే అయి­నా.. క్షే­త్ర­స్థా­యి­లో పా­ర్టీల మధ్య సా­ర్వ­త్రిక ఎన్ని­క­ల­ను మిం­చి పోటీ జరి­గిం­ది. ప్ర­ధా­నం­గా కాం­గ్రె­స్‌, బీ­ఆ­ర్‌­ఎ­స్‌ పా­ర్టీల పక్షాన వర్గా­లు­గా సమీ­క­రణ జరి­గి.. పోరు రస­వ­త్త­రం­గా మా­రిం­ది. ఈ ఎన్ని­క­ల­ను అధి­కార కాం­గ్రె­స్‌ ప్ర­తి­ష్ఠా­త్మ­కం­గా తీ­సు­కో­వ­డం­తో అభ్య­ర్థుల ఎం­పిక నుం­చి నా­య­కుల మధ్య సయో­ధ్య కు­ద­ర్చ­డం దాకా మం­త్రు­లు, పా­ర్టీ ఎం­పీ­లు, ఎమ్మె­ల్యే­లు దగ్గ­రుం­డి చూ­సు­కు­న్నా­రు. వారి ప్ర­య­త్నం ఫలి­తా­ల్లో ప్ర­తి­ఫ­లిం­చిం­ది. సి­ద్ది­పేట మి­న­హా అన్ని జి­ల్లా­ల్లో­నూ బీ­ఆ­ర్‌­ఎ­స్‌ కంటే ఎక్కు­వ­గా కాం­గ్రె­స్‌ బల­ప­రి­చిన అభ్య­ర్థు­లే సర్పం­చ్‌­లు­గా గె­లి­చా­రు. కే­సీ­ఆ­ర్‌, హరీ­శ్‌­రా­వు ప్రా­తి­ని­ధ్యం వహి­స్తు­న్న సి­ద్ది­పేట జి­ల్లా­లో మా­త్రం బీ­ఆ­ర్‌­ఎ­స్‌ పై­చే­యి సా­ధిం­చిం­ది. ఈ జి­ల్లా­లో తొలి వి­డ­త­లో 163 పం­చా­య­తీ­ల­కు­గా­ను 16 ఏక­గ్రీ­వం కాగా, బీ­ఆ­ర్‌­ఎ­స్‌ బల­ప­రి­చిన అభ్య­ర్థు­లు 75 సర్పం­చ్‌ సీ­ట్లు గె­లు­చు­కో­గా.. కాం­గ్రె­స్‌ మద్ద­తి­చ్చిన వారు 60 సీ­ట్ల­లో మా­త్ర­మే గె­లి­చా­రు. ఇక్కడ బీ­జే­పీ­కి 11 స్థా­నా­లు దక్క­గా, ఇత­రు­లు 17 స్థా­నా­ల­ను దక్కిం­చు­కు­న్నా­రు. ఇక బీ­ఆ­ర్‌­ఎ­స్‌ వర్కిం­గ్‌ ప్రె­సి­డెం­ట్‌ కే­టీ­ఆ­ర్‌ ని­యో­జ­క­వ­ర్గం ఉన్న రా­జ­న్న సి­రి­సి­ల్ల జి­ల్లా­లో మా­త్రం కాం­గ్రె్‌­స­ది పై­చే­యి అయిం­ది. ఆ జి­ల్లా­లో 42 చో­ట్ల కాం­గ్రె­స్‌ బల­ప­రి­చిన అభ్య­ర్థు­లు వి­జ­యం సా­ధి­స్తే 30 చో­ట్ల బీ­ఆ­ర్‌­ఎ­స్‌ మద్ద­తు­దా­రు­లు గె­లి­చా­రు. ఇక తొలి వి­డ­త­లో 395 గ్రా­మా­ల్లో ఎన్ని­క­లు ఏక­గ్రీ­వం కాగా, వీ­టి­లో 90 శా­తా­ని­కి పైగా కాం­గ్రె్‌­స­కే దక్కా­యి.

Tags:    

Similar News