అంబేద్కర్ వర్ధంతి రోజున ఆయన అభిమానులు నొచ్చుకునే ఘటన జరిగింది. తెలంగాణ సచివాలయానికి పక్కనే ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ స్మృతి వనానికి తాళం వేసి ఉంచడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. అంబేద్కర్ వర్ధంతి రోజున నివాళి అర్పించేందుకు ఎవరినీ అనుమతించకపోవడాన్ని విపక్ష నేతలు తప్పు పడుతున్నారు. కేసీఆర్ కట్టాడన్న ఉద్దేశంతోనే స్మృతి వనానికి ప్రభుత్వం తాళం వేసిందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు.
దళితబంధు డిమాండ్ చేస్తున్నవారిపై కేసులు పెడుతున్నారన్నారు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సర్కార్‌పై ఫైర్ అయ్యారు. దళితబంధు తొలగించి అంబేడ్కర్ అభయహస్తం తెస్తామన్నారు కానీ ఇప్పటి వరకూ దాని ఊసేలేదన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందన్నారు. ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.