తెలంగాణ వ్యాప్తంగా గురుకుల పాఠశాలలకు తాళాలు పడుతున్నాయి. ప్రభుత్వం అద్దె చెల్లించకపోవడంతో గురుకులాలు నిర్వహిస్తున్న భవన యజమానులు తాళాలు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలకు, వసతి గృహాలకు తాళాలు వేస్తున్నారు బిల్డింగ్ యజమానులు. తుంగతుర్తి, బెల్లంపల్లి, తాండూరు, వరంగల్, భూపాలపల్లి, హుజూర్ నగర్ లో పాఠశాలలు, వసతి గృహాలకు తాళాలు వేశారు బిల్డింగ్ యజమానులు. దసరా సెలవులు ముగియడంతో పాఠశాల ప్రారంభం అయ్యాయి. గురుకులాలకు వచ్చిన విద్యార్థులు, ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, సిబ్బంది మొత్తం పాఠశాల గేటు ముందు నిలబడ్డారు. దీంతో.. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం తీరును ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి.