కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ గౌడ్ పార్టీలో చేరికలపై సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలు తమ అక్రమ ఆస్తులతోపాటు తమ రాజకీయ భవిష్యత్తు కోసమేనని సంచలన కామెంట్స్ చేశారు కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ పై ప్రేమతో చేరడం లేదన్నారు.జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామంలో ఇటీవల హత్యకు గురైన గంగారెడ్డి కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో కలిసి ఆయన పరామర్శించారు.
ఈ చేరికల వెనుక మర్మాన్ని అధినాయకత్వానికి తెలియచేస్తున్నట్లు చెప్పారు. పోలీసులు ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందనే భ్రమలో ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో అసలు సిసలైన కాంగ్రెస్ నాయకులకే నామినేటెడ్ పదవులు కేటాయించే విధంగా చర్యలు తీసుకునేందుకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నట్లు తెలిపారు.