Mahmood Ali: శాంతి భద్రతలో తెలంగాణ ముందంజ
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు.;
మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్‌లో మహిళా సదస్సు జరిగింది. నగర సీపీ సీవీ ఆనంద్‌తో పాటు కార్యక్రమానికి హాజరైన మహమూద్ అలీ శాంతి భద్రతలో తెలంగాణ దేశంలోనే ముందజలో ఉన్నట్లు తెలిపారు.2013-14తో పోలిస్తే నేరాల శాతం తగ్గిందన్నారు. షీటీమ్స్, భరోసా కేంద్రాలు మహిళలకు అండగా ఉంటున్నాయని మహమూద్ అలీ చెప్పారు.దేశంలోనే తెలంగాణ శాంతి భద్రతలకు నిదర్శనంగా మారిందన్నారు.
ప్రజలకు, ప్రభుత్వానికి అనుబంధంగా HCSC పనిచేస్తుందని నగర సీపీ సీవీ ఆనంద్ అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం.. పోక్సో, దిశ చట్టం సహా షీటీమ్స్, ఉమెన్ సేఫ్టీ విభాగాలతో పటిష్ట చర్యలు తీసుకుంటోందని తెలిపారు. తొలి మహిళా SHOగా లాలాగూడ స్టేషన్‌కు మధులత నియమించడం ఆనందంగా ఉందని సీపీ ఆనంద్ అన్నారు.