తెలంగాణలో అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ సహా సీఐలను బదిలీ చేసి సర్కార్ ఇప్పుడు పోలీస్ శాఖలో మరికొన్ని బదిలీలకు శ్రీకారం చుట్టింది. ఎస్పీ ( నాన్ కేడర్ ) ఆఫీసర్లను బదిలీ చేస్తూ హోం శాఖ స్పెషల్ ఛీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులను జారీ చేశారు. 13 మంది అధికారులను బదిలీ చేశారు. ఇంటిలిజెన్స్ విభాగంలో ముగ్గురు ఎస్పీ స్థాయి అధికారులు బదిలీ అయ్యారు. హైదరాబాద్ సిటి ట్రాఫిక్ డీసీపీ ఎన్ అశోక్ కుమార్ ను హైడ్రా విభాగానికి బదిలీ చేశారు. ఇంటెలిజెన్స్‌లో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న జి. వెంకటేశ్వర బాబును ఎక్సైజ్ శాఖకు బదిలీ చేశారు. సీఐడీలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న జి. బాలస్వామిని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కామారెడ్డిలో అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న కోట్ల నర్సింహారెడ్డిని సీఐడీ అడిషనల్ ఎస్పీగా, నాగర్‌కర్నూల్‌లో అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న జీ.హెచ్. రామేశ్వర్‌ను రాచకొండ క్రైమ్స్ అడిషనల్ డీసీపీగా బదిలీ చేశారు. హైదరాబాద్ సిటీ సౌత్ వెస్ట్ జోన్ అడిషనల్ డీసీపీగా, కోట్ల వెంకట్‌రెడ్డిని టీజీ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అడిషనల్ ఎస్పీగా, జి.బిక్షం రెడ్డిని సీఐడీ అడిషనల్‌ఎస్పీగా బదిలీ చేశారు.