Malladi Chandrasekhara Sastry : ప్రవచనకర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి ఇక లేరు..!

Malladi Chandrasekhara Sastry : ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు.

Update: 2022-01-14 14:28 GMT

Malladi Chandrasekhara Sastry : ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1925 ఆగస్టు 28వ తేదీన మల్లాది దక్షిణామూర్తి దంపతులకు జన్మించారు. చంద్రశేఖరశాస్త్రి సనాతన సత్సంప్రదాయం గల కుటుంబంలో జన్మించారు.

15ఏళ్ల వయసులోనే ప్రవచన యజ్ఞాన్ని ప్రారంభించారాయన. హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో మల్లాది చంద్రశేఖరశాస్త్రి సుప్రసిద్ధులు. చంద్రశేఖరశాస్త్రి వారి సుదీర్ఘ పురాణ ప్రవచన ప్రస్థానంలో ఎందరో ప్రముఖులు, ప్రముఖ సంస్థలతో లెక్కలేనన్ని సన్మానాలు, సత్కారాలు, బిరుదులు పొందారు.

అందులో ప్రముఖంగా తిరుమల తిరుపతి దేవస్థానాలలో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యాతగా స్వామివారి కల్యాణాన్ని భక్తుల కన్నుల ముందు సాక్షాత్కరింపచేసి అభినవ వ్యాస బిరుదును పొందారు. ఆలిండియా రేడియో,దూరదర్శన్‌లలో ఎన్నో ప్రవచనాలు ఇచ్చారు. ఈయన తెలుగు, సంస్కృత భాషల్లో మంచి ఘనాపాఠి.

Tags:    

Similar News