MALLANNA: రెడ్లు ప్రాణాలిచ్చిన పర్లేదు: తీన్మార్ మల్లన్న
ఆత్మబలిదానం చేసుకున్న అంగీకరిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు;
బీసీలకు తెలంగాణలో ఉన్న రెడ్లు, వెలమలకు ఎప్పుడో బంధం తెగిపోయిందని ఇక మీతో సోపతే వద్దు అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ సార్ కలలుగన్న బీసీ రాజ్యం కోసం బీసీ జేఏసీ నడుము కట్టి ముందుకు వస్తుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని స్థానాల్లో బీసీ జేఏసీ తరఫున అభ్యర్థులు బరిలో ఉంటారని చెప్పారు. నిజామాబాద్ లో నిర్వహించి బీసీ జేఏసీ సమావేశానికి హజరైన మల్లన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చరిత్రలో మొట్టమొదటి సారి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని రెడ్లు, వెలమలు ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశారని నిజానికి ఆ ధర్నా వాళ్లు చేయలేదని బీసీల చైతన్యమై వాళ్లతో ఆ ధర్నా చేయించిందన్నారు. ఇది బీసీల సత్తా అని అన్నారు. గతంలో కేసీఆర్ అధికారంలోకి వచ్చేందుకు ఆ తర్వాత రెడ్లు అధికారంలోకి వచ్చేందుకు మా బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రాణాలే పోయాయని ఇప్పుడు బీసీలు అధికారంలోకి రావడం కోసం రెడ్లు, వెలమలు ఆత్మబలిదానం చేసుకున్నా అంగీకరిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఇది భవిష్యతో బీజేపీకి ఉరితాడుగా మారుతుందని మల్లన్న హెచ్చరించారు. కేసీఆర్ నోటి నుంచి ఇప్పటి వరకు బీసీ అనే పదం రాలేదని బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లోని అగ్రవర్ణాలంతా ఒకతాను ముక్కలేనని విమర్శించారు. విష సర్పాలు ఒక పుట్ట నుంచి మరో పుట్టలోకి మారినంత మాత్రాన దాని విషయం పోదని అలాగే అగ్రవర్ణాల నాయకులు పార్టీ మారినంత బీసీలకు న్యాయం జరగదన్నారు.
"కాంగ్రెస్కు ముందే చెప్పాం"
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై టీజేఎస్ చైర్మన్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోలేదని అందువల్ల కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడాలని ఎన్నికలకు ముందే కాంగ్రెస్ కు చెప్పామని కోదండరామ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు వాళ్ల పార్టీలో అంతర్గత చర్చ ఉంటుందని దాని ప్రకారమే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటారన్నారు. అధికారంలోకి వచ్చే ముందే అప్పులు ఉన్నాయని తెలుసని ప్రకటనలు చేసే ముందే జాగ్రత్తలు తీసుకోవాలని ఎన్నికలకు ముందు చెప్పామని ఇప్పుడు కూడా చెబుతున్నామన్నారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా రైతుభరోసా, రేషన్ బియ్యం, పించన్లు కచ్చితంగా అమలు చేయాల్సిందేనని అన్నారు. వీటిని అమలు చేశాక రాష్ట్రానికి ముగులుతున్న ఆర్థిక వనలురు చాలా పరిమితంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆర్థిక రంగం పునర్వ్యవస్థీకరణ , ఆదాయం పెంపుపై ఈ ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉందని ఈ విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. గతంలో బీఆర్ఎస్ చేసిన అప్పులను నిష్ర్పయోజనం చేసిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నుంచి ఎలా బయటపడతాం అనేది ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉంటుందన్నారు.