MALLAREDDY: కుమార్తె ముఖ్యం కాదు.. పార్టీ ముఖ్యం: మల్లారెడ్డి
అధికార-ప్రతిపక్షాల మాటల యుద్ధం
బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు, సంతోష్ రావులపై కవిత చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కవిత వ్యాఖ్యలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని చెప్పారు. ‘‘కేసీఆర్‌కు కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదు.. ఆయనకు పార్టీయే ముఖ్యం. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయి. ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌కు ముఖ్యం. తన కుమార్తె, కుమారుడి కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో సీబీఐ మాత్రమే కాదు.. ఎవరూ ఏమీ చేయలేరు. సీబీఐ పేరుతో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ నాయకుడిగా ఉండటం మనందరి అదృష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తోంది’’ అని మల్లారెడ్డి విమర్శించారు.
చచ్చినా పామును ఇంకా చంపలేం: టీపీసీసీ చీఫ్
బీఆర్ఎస్ నేతలపై జాగృతి నాయకురాలు కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కవిత కొన్ని సత్యాలు, కొన్ని అసత్యాలు చెప్పారని అన్నారు. చచ్చిన పామును ఇంకా చంపే ఓపిక తమకు లేదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డిపై కవిత చేసిన వ్యాఖ్యలు అన్ని ఆధార రహితమని... అర్ధ రహితమని మండిపడ్డారు. హరీశ్ రావుతో కాంగ్రెస్ కుమ్మక్కు అయిందన్న వార్తలపై తీవ్రంగా స్పందించారు. తమకు అలాంటి అవసరం లేదని ఆరోపించారు. కవిత రాజీనామా బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారమన్న మహేష్ కుమార్ గౌడ్... బీఆర్ఎస్ క్రమంగా ఉనికి కోల్పోతోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో మామ కేసీఆర్ వాటా ఎంత..? అల్లుడు హరీశ్ రావు వాటా ఎంత..? అనేది తేలాల్సి ఉందన్నారు.
బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదు: రఘునందన్‌రావు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితన బీజేపీలో చేరుతారంటూ ఊహాగానాలు చెలరేగాయి. దీనిపై బీజేపీ కీలక నేత, ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవితను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. హరీష్ రావు - సీఎం రేవంత్ రెడ్డి ఒకే ఫ్లైట్‌లో వచ్చారనేది నిజం అని అన్నారు. ఫ్లైట్‌లో వాళ్లు తనను ఓడించడం విషయం గురించే మాట్లాడుకున్నారని చెప్పారు. కవిత రాజకీయాలకు దూరంగా ఉంటే వ్యక్తి కాదు.. తప్పకుండా కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. దాంతో పాటు కవిత కొత్తగా ఏమీ చెప్పలేదని చాలా కాలంగా తాము చెబుతున్న విషయాలనే ఇప్పుడు ఆమె చెప్పారని జడ్పీ అధ్యక్షుడిగా తనను ఎవరు ఓడించారో గతంలో కేసీఆర్‌కు చెప్పానని అయినా ఆ రోజు కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీల అవినీతిని పార్టీ నుంచి సస్పెండ్ కాకముందు మాట్లాడి ఉంటే బాగుండేదని రఘునందన్ రావు అన్నారు.