Sexual Assault : బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. భర్త చనిపోవడంతో ఓ మహిళ కూలీపనులు చేసుకుంటూ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటోంది. ఆమె పక్క ఇంటిలో ఉంటున్న గాలి తరుణ్(20) బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించాడు. మ్యాజిక్ చూపిస్తానని చెప్పి బాలికను మొదటి అంతస్తుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
బాలిక అరుపులు విన్న ఇంటి యజమాని వచ్చి తరుణ్‌ను కొట్టి బాలికను కాపాడాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు, బాలికను భరోసా సెంటర్‌కు తరలించి, దర్యాప్తు చేశారు. కేసును విచారించిన నాంపల్లి 12వ స్పెషల్ సెషన్ జడ్జి న్యాయమూర్తి టి.అనిత... నిందితుడు గాలి తరుణ్‌కు 20 ఏళ్ల జైలు, రూ.5వేల జరిమానా విధిస్తూ తీర్పిచ్చారు.