మాజీ ఎంపీ మందా జగన్నాథంకు హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రస్తుతం నిమ్స్‌లో వెంటిలేటర్‌పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మంద జగన్నాథం నాలుగుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వైద్య విద్యలో ఆయన ఎంఎస్ పూర్తి చేశారు. టీడీపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల్లో ఆయన పనిచేశారు. ప్రముఖులు ఆయన్ని హాస్పిటల్ లో పరామర్శిస్తున్నారు.