Robbery: హైదరాబాద్‌లోని స్టార్ హోటల్‌లో భారీ చోరీ..
Robbery: హైదరాబాద్‌లోని స్టార్ హోటల్‌లో భారీ చోరీ జరిగింది. వజ్రాలు, డైమండ్ బ్రాస్‌లెట్, డైమండ్ రింగ్, మంగళసూత్రం, గోల్డ్ చైన్, చెవి దిద్దులు చోరీ అయ్యాయి.;
Robbery: హైదరాబాద్‌లోని స్టార్ హోటల్‌లో భారీ చోరీ జరిగింది. వజ్రాలు, డైమండ్ బ్రాస్‌లెట్, డైమండ్ రింగ్, మంగళసూత్రం, గోల్డ్ చైన్, చెవి దిద్దులు చోరీ అయ్యాయి.వీటి విలువ లక్షల రూపాయలు ఉంటుందని చెబుతున్నారు.
సెప్టెంబర్ 22న బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్‌లో దిగిన ముంబై వ్యాపారి అహ్మద్ బేగ్.. రెండు రోజుల తరువాత సోమాజిగూడలోని మరో హోటల్‌కు మారారు. హోటల్ మారిన తరువాత బంగారం, వజ్రాలు, నగలు కనిపించకుండా పోవడాన్ని అహ్మద్ బేగ్ గమనించారు.
వెంటనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఆభరణాలు పార్క్ హయత్‌లో చోరీ అయ్యాయా లేక సోమాజీగూడలోని హోటల్‌లో దొంగతనానికి గురయ్యాయా అనేది తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.