Medaram Jatara : మేడారం తిరుగువారం.. ఏం చేస్తారో తెలుసా..

Update: 2024-02-28 06:57 GMT

Medaram Jatara : మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు ఫిబ్రవరి 28 బుధవారం నాడు తిరుగువారం పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 7న మండమెలిగే పండుగతో ప్రారంభమైన జాతర.. శనివారం వనదేవతల వన ప్రవేశంతో పూర్తయింది.

లక్షలాది మంది భక్తులు సమక్క, సారలమ్మలను దర్శించుకున్నారు. పండుగ పూర్తి కావడంతో బుధవారం పూజారులు తిరుగువారం పండుగను నిర్వహిస్తున్నారు.

మహాజాతర ఘట్టం పూర్తిగా ముగిసినట్లు పూజారులు ప్రకటిస్తారు. సమ్మక్క-సారలమ్మ పూజా మందిరాల్లో పూజా సామగ్రిని శుద్ధి చేసి గుడిలో భద్రపరుస్తారు. అనంతరం సమ్మక్క-సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూజా మందిరాలకు తాళాలు వేస్తారు. తిరిగి వచ్చే ఫిబ్రవరిలో మినీ జాతర సందర్భంగా పూజా సామగ్రిని బయటకు తీసి పూజలు చేస్తారు.

Tags:    

Similar News