Telangana : రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్

Update: 2025-07-15 10:45 GMT

వాతావరణ శాఖ రైతులకు చల్లని కబురు చెప్పింది. వర్షాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సంవత్సరం ఋతుపవనాలు ముందే వచ్చినప్పటికీ జూన్ ,జూలై నెలల్లో వర్షాలు ఎక్కువగా లేవు. దీంతో పెట్టిన విత్తనాలు మొలకెత్తక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. కాగా రానున్న 5 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ, తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేస్తోంది.

ఐతే వర్షాలు లేకపోయినా ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వరద కారణంగా నదులు , వాగులు పొంగిపొర్లుతున్నాయి. తెలంగాణలో ప్రవహించే కృష్ణ, గోదావరి, తుంగభద్రలకు వరద ప్రవాహం ఎక్కువ కావడంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. హైదరాబాదు తో పాటు తెలంగాణ జిల్లాలలోనీ వివిధ ప్రాంతాల్లో బలమైన ఉరుములు, పిడుగులతో కూడిన భారీ వర్షాలు విస్తారంగా కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే.. జూలై 23-28 మధ్య.. వరుసగా అల్పపీడనాలు కారణంగా, ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో ముసురుతో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని, హైదరాబాద్ లో కూడా మోస్తరు నుంచి భారీ వరాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News