Hyderabad Data Center: తెలంగాణ ప్రభుత్వంతో మైక్రోసాఫ్ట్ ఒప్పందం.. భారీ పెట్టుబడితో..
Hyderabad Data Center: తెలంగాణ పెట్టుబడుల హబ్‌గా మారిందన్నారు మంత్రి కేటీఆర్.;
Hyderabad Data Center: తెలంగాణ పెట్టుబడుల హబ్‌గా మారిందన్నారు మంత్రి కేటీఆర్. అతిపెద్ద డేటా సెంటర్‌తో హైదరాబాద్‌లో ఐటీ మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్ దిగ్గజం మెక్రోసాప్ట్ అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో నెలకొల్పనున్నట్లు గచ్చిబౌలీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో మైక్రోసాప్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం మైక్రోసాప్ట్ కు పూణే, ముంబై, చెన్నైలలో డేటా సెంటర్లు ఉన్నాయి. వీటికి అదనంగా నాలుగో డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించనున్నారు. 2025 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది.