REVANTH: సీఎం రేవంత్ ఎమోషనల్ పోస్ట్
ఇది మరిచిపోలేని క్షణం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్
ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి ఉప్పల్ వేదికగా మ్యాచ్ ఆడటంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఇది మరిచిపోలేని క్షణం అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు సీఎం రేవంత్. ముఖ్యంగా ఉప్పల్ స్టేడియంలో అపర్ణ మెస్సి జట్టుతో జరిగిన ఫుట్ బాల్ మ్యాచ్ లో తాను గోల్ చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వెల్లడించారు. అంతేకాదు గోల్ చేసిన వీడియోను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక అంతకుముందు మెస్సికి స్వాగతం చెబుతూ మరో పోస్ట్ పెట్టారు. ఇది ఇలా ఉండగా, ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ పూర్తయిన తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి మనువడితో మెస్సి ఫుట్ బాల్ అడిగిన సంగతి తెలిసిందే. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాహుల్ గాంధీకి జెర్సీ గిఫ్ట్ గా ఇచ్చారు మెస్సి. ఆ తర్వాత ఫలక్ నూమ ప్యాలస్ కు మెస్సి వెళ్లారు. శనివారం అక్కడే బస చేయనున్నారు. ఆదివారం ఉదయం 10:30 గంటల సమయంలో ముంబైకి పయనం అవుతారు. అప్పటి వరకు హైదరాబాద్ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ టూర్ స్మూత్ జరిగింది. స్టేడియంలో జరిగిన మ్యాచ్.. షెడ్యూల్ ప్రకారం ఎలాంటి గందరగోళం లేకుండా సాగిపోయింది. రెండు టీములు ఏర్పాటయ్యాయి. సింగరేణి టీమ్ ఆర్ఆర్9కు..సీఎం రేవంత్ రెడ్డి కెప్టెన్ గా వ్యవహరించారు. మరో స్పాన్సర్ అపర్ణ పేరుతో ఉన్న టీమ్ కు మెస్సీ నాయకత్వం వహించారు. అయితే మెస్సీ.. షూటౌట్ లోనే ఆడారు. రేవంత్ రెడ్డి మామూలు గేమ్ లోనూ గోల్ కొట్టారు. మెస్సీ అభివాదం చేసినప్పుడల్లా స్టేడియం హోరెత్తిపోయింది. టిక్కెట్ రేట్లు చాలా ఎక్కువ పెట్టినప్పటికీ చాలా మంది తరలి వచ్చారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా గ్రౌండ్ లోకి వచ్చారు. మెస్సీతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. మెస్సీతో చాలా సేపు మాట్లాడుతూ కనిపించారు. ఫుట్‌బాల్ దిగ్గజాలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆటతో సంబరం అంబరాన్ని తాకింది.
ముందే ఎందుకు వెళ్లిపోయాడు?
మైదానంలో రాగానే చుట్టూ రాజకీయ నాయకులు, వీఐపీలు, పోలీసు అధికారులు తన చుట్టూ వలయంలా ఏర్పడడంతో మెస్సి అయోమయానికి గురైనట్లు కనిపించాడు. మైదానంలో తిరగడానికి ప్రయత్నిస్తూ.. అసౌకర్యంతోనే మాజీ ఆటగాళ్లకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. పరిస్థితి గందరగోళంగా మారుతోందని గ్రహించిన ప్రమోటర్ శతద్రు.. ‘‘దయచేసి అతణ్ని ఒంటరిగా వదిలేయండి. మైదానాన్ని ఖాళీ చేయండి’’ అని మైకులో గద్గద స్వరంతో పదే పదే వేడుకున్నాడు. అయినా ఫలితం లేకపోయింది. అక్కడున్న సెలెబ్రిటీలు ఎవరూ అతడి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. మెస్సి చుట్టూ గుమిగూడడాన్ని కొనసాగించారు. గంగూలీ వస్తున్నాడన్న వార్తతో వాతావరణం మరింత వేడెక్కింది. మైదానంలో మెస్సిని కలవడం కోసం బయట నిరీక్షించిన షారుక్.. అక్కడి పరిస్థితిని చూసి తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఆ తర్వాత మెస్సిని కలిశాడు. అంతా అయోమయంగా మారడంతో మెస్సిని 22 నిమిషాల్లోనే భద్రత మధ్య మైదానం నుంచి తీసుకెళ్లారు. నిజానికి షెడ్యూలు ప్రకారం అతడు.. స్టేడియంలో గంటసేపు ఉండాలి. మెస్సిని వెళ్లిపోవద్దని.. ఇంకొంత సమయం స్టేడియంలో ఉండాలని నిర్వాహకుడు శతద్రు దత్తా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ విజ్ఞప్తి చేశారని సమాచారం. కానీ పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన మెస్సి భద్రత విభాగం అతడిని అక్కడ కొనసాగేందుకు నిరాకరించింది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు ఏడీజీ తెలిపారు. స్టేడియానికి హాజరైన ప్రేక్షకులకు నిర్వాహకులు డబ్బు రీఫండ్ చేస్తారని ఏడీజీ అన్నారు.