మీడియాలో చూపిస్తున్న కారు నాది కాదు : అజయ్‌

Update: 2020-12-02 13:00 GMT

హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలు తనను చంపాలని ప్రయత్నం చేశారని ఆరోపించారు.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌. బాచుపల్లిలోని తమ కాలేజీకి వెళ్తుండగా... కూకట్‌పల్లి దగ్గర తన కారుపై దాడి చేశారని చెప్పారు. బీజేపీ అబద్దాలను ప్రచారం చేస్తోందని.. మీడియాలో వస్తున్న కారు తనది కాదన్నారు. బాధ్యత కలిగిన తనను మంత్రి మండలి నుంచి బర్తరఫ్‌ చేయాలని సీపీఐ నేత నారాయణ అనడం అశ్చర్యం కలిగించిందన్నారు. నారాయణ ఎప్పుడు బీజేపీలో చేరారో చెప్పాలని ఎద్దేవా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ గెలిచి తీరుతుందని అజయ్‌ ధీమా వ్యక్తం చేశారు.


Tags:    

Similar News