రాబోయే రోజుల్లో పక్క రాష్ట్రాలకు కూడా మందులు సరఫరా చేసే స్థాయికి తెలంగాణ ఎదుగుతుందన్నారు మంత్రి హరీష్ రావు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు ఎక్కువ అయినందువల్ల ఐదు మెడికల్ కాలేజీల్లో ఏపీ విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. సిద్దిపేటలో ఆయుర్వేదిక్ వైద్యుల కృతజ్ఞత సభ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు.. ప్రభుత్వ ఆస్పత్రుల వైద్య సేవల్లో దేశంలో తెలంగాణ 3వ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు.
నేదురుమల్లిపై మండిపడ్డారు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫుట్‌బాల్ ఆడిస్తానని హాట్ కామెంట్స్ చేశారు. వెంకటగిరిలో ఫుట్‌బాల్ ఆడేవారిని తయారు చేస్తానని అన్నారు. వెంకటగిరి ఎమ్మెల్యేగా 6 నెలలు గ్యాప్ ఇచ్చానని.. ఇక్కడ జరిగిన పరిస్థితులు ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. వెంకటగిరిని వదిలేది లేదని స్పష్టం చేశారు.