Harish Rao : ఘనంగా కొమురవెల్లి మల్లన్న కల్యాణం.. పట్టు వస్త్రాలు సమర్పించిన హరీశ్‌రావు
Harish Rao : కొమురవెల్లి మల్లిఖార్జున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి హరీష్‌రావు.;
Harish Rao : కొమురవెల్లి మల్లిఖార్జున స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు మంత్రి హరీష్‌రావు. మార్గశిరమాసం చివరి ఆదివారం కావడంతో స్వామివారికి కల్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. వీరశైవాగమశాస్త్రం ప్రకారం కేతలమ్మ, మేడాల దేవిని మల్లన్న స్వామి వివాహమాడారని చెబుతారు. ఆలయ ప్రాంగణంలోని తోటబావి ప్రాంతంలో వివాహ వేడుకలను అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామివారి కల్యాణం సందర్భంగా ప్రభుత్వం తరపున మంత్రి హరీష్‌రావు పట్టువస్త్రాలు తీసుకెళ్లారు. మంత్రులు తలసాని శ్రీనివాస్, మల్లారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం కల్యాణానికి హాజరయ్యారు.