Harish Rao : కేంద్రంపై విమర్శలు గుప్పించిన మంత్రి హరీష్ రావు
Harish Rao : తెలంగాణ అసెంబ్లీలో 2022-23 బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు.;
Harish Rao : తెలంగాణ అసెంబ్లీలో 2022-23 బడ్జెట్ ను రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. రూ. 2.56 కోట్లతో ఆయన బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా కేంద్రంపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు. కేంద్రం తెలంగాణ పట్ల చిన్నచూపు చూస్తోందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు అడిగినప్పటికీ ఇవ్వలేదన్నారు. విభజన హామీలు నెరవేర్చలేదన్నారు. కేంద్రం తీరుతో తెలంగాణ సీలేరు పవర్ ప్రాజెక్టును కోల్పోయిందన్నారు. ఐటీఐఆర్ అమలు చేసి ఉంటే తెలంగాణ ఐటీలో మరింత ప్రగతి సాధించేదన్నారు.