ఈటల రాజేందర్ ఎందుకు రాజీనామా చేశారో చెప్పాలి: హరీష్‌రావు
Harish Rao: ఈటెల రాజేందర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీష్‌రావు మండిపడ్డారు.;
మీ సహకారంతో గెల్లు శ్రీనును గెలుపు శ్రీనుగా ముఖ్యమంత్రికి బహుమతిగా ఇద్దామని మంత్రి హరీష్‌రావు గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు.. వీణవంక మండల టీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న హరీష్‌రావు.. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ను ఎందుకు గెలిపించాలో వివరించారు. వీణవంకలో రెండు మూడు రోజుల్లో 24 గంటలు పనిచేసేలా ఆస్పత్రి మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. అసహనంతో ఈటెల రాజేందర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీష్‌రావు మండిపడ్డారు. బీజేపీ అమ్మకానికి రూపమైతే.. టీఆర్‌ఎస్ నమ్మకానికి మరో రూపమన్నారు హరీష్‌రావు.