Harish Rao : పెద్ద లీడర్లకు కార్లు, బైక్‌లు గిఫ్టులుగా ఇస్తున్నారు : మంత్రి హరీష్ రావు
Harish Rao : మునుగోడులో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తుందని భగ్గుమన్నారు మంత్రి హరీష్‌రావు;
Harish Rao : మునుగోడులో బీజేపీ నీచ రాజకీయాలు చేస్తుందని భగ్గుమన్నారు మంత్రి హరీష్‌రావు. కోట్లు ఖర్చు చేసి నాయకులను కొంటున్నారని ఆరోపించారు. పెద్ద లీడర్లకు కార్లు, బైక్‌లు గిఫ్ట్‌గా ఇస్తున్నారని.. బీజేపీ అడ్డదారిలో గెలిచే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇప్పుడు మోటార్ బైక్‌లు ఇస్తారని.. తర్వాత మోటార్లకు మీటర్లు పెడతారన్నారు. 8 ఏళ్లలో బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు.
తాంత్రిక పూజలంటూ బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి దమ్ముంటే చేసే ఆరోపణలపై ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. బీజేపీ దివాలాకోరు రాజకీయాలు చేస్తుందని విరుచుకుపడ్డారు.