తెలంగాణ మంత్రి కొండా సురేఖ పదవికి రాజీనామా చేయనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేటీఆర్‌ను టార్గెట్ చేసే క్రమంలో నాగార్జున కుటుంబం గురించి సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారు. సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై సినీ ప్రముఖులు మండిపడ్డారు. నాగార్జున భార్య అమల రాహుల్, ప్రియాంక గాంధీలను ట్యాగ్ చేస్తూ సురేఖపై చర్యలకు డిమాండ్ చేశారు. దీంతో.. ఇది ఇండస్ట్రీలో పెద్ద దుమారానికి కారణమైంది.
ప్రియాంక గాంధీ నేరుగా అమలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. ప్రియాంక గాంధీ - అమల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సురేఖ చెప్పింది విన్న ప్రియాంక గాంధీ.. తాము తప్పనిసరిగా న్యాయం చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో.. హైకమాండ్ సూచనతో కొండా సురేఖ రాజీనామా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణలో కొండా సురేఖను మంత్రి పదవి నుండి తొలగిస్తారని టాక్ నడుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కొండా సురేఖ విషయంలో స్పష్టత రావచ్చని చెబుతున్నారు.