మాజీ మంత్రి ఈటలపై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం..!
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈటలకు టీఆర్ఎస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.;
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ఈటలకు టీఆర్ఎస్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రభుత్వంపైన, సీఎం కేసీఆర్‌పైన ఈటల ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. ఈటలకు సీఎం కీలకమైన మంత్రి పదవులు ఇచ్చారన్న ఆయన.. ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతినిందో చెప్పాలన్నారు. అసైన్డ్ భూములు కొనవద్దని చట్టం చెబుతున్నా మంత్రిగా ఈటల ఆ భూములను ఎలా కొన్నారని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.