Minister KTR : ఎంపీ బండి సంజయ్‌కి సవాల్ విసిరిన మంత్రి కేటీఆర్
Minister KTR : మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు.;
Minister KTR : మంత్రి కేటీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో మంత్రి గంగుల కమలాకర్‌పై పోటీచేసి గెలువుమన్నారు. ఈ సారి గంగులను లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని కేటీఆర్ శపధం చేశారు. కరీంనగర్‌లో వెయ్యి కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎంపీ బండిసంజయ్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి మూడేళ్లైనా.. కనీసం మూడు కోట్ల పని అయినా చేశావా అని నిలదీశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా ఏమైందన్నారు. హిందూ.. హిందూ అంటావు.. కనీసం టీటీడీ నుంచి గుడి అయినా తీసుకొచ్చావా .. అది కూడా మేమే తెచ్చుకున్నామన్నారు మంత్రి కేటీఆర్.