Minister KTR : 10 వేల కోట్లు తెస్తే కిషన్‌రెడ్డికి సన్మానం చేస్తాం : మంత్రి కేటీఆర్
Minister KTR : ఎల్‌బీనగర్ చౌరస్తాలో ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో 9.28 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్, 29కోట్లతో బైరామల్‌గూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.;
Minister KTR : హైదరాబాద్లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రొగ్రాం - ఎస్‌ఆర్‌డీపీ లో మరో రెండు కీలక ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఎల్‌బీనగర్ చౌరస్తాలో ఇన్నర్‌రింగ్‌రోడ్డు మార్గంలో 9.28 కోట్లతో నిర్మించిన అండర్‌పాస్, 29కోట్లతో బైరామల్‌గూడ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లైఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు.
ఎల్బీనగర్ పర్యటనలో భాగంగా నాగోల్, బండ్లగూడలో నాలా అభివృద్ధి పనులకూ శంకుస్థాపన చేశారు మంత్రి కేటీఆర్. వర్షాలు, వరదల వల్ల ఎల్బీనగర్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు. 2,500 కోట్లతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టామన్ని వరద ముంపు నివారణకు వెయ్యి కోట్లతో నాలాల అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.
ఇక కేంద్రం నిధులు ఇచ్చి టీఆర్ఎస్‌తో పోటి పడాలన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ముంపు గ్రామాల ప్రజల సమస్యలను తీర్చేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 10 వేల కోట్ల రూపాయలు తీసుకొస్తే ఆయన పౌరసన్మానం చేస్తామంటూ సవాల్ విసిరారు మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహముద్ అలీతో పాటు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు. అటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, ప్రజలు వచ్చారు.