ఓపికకు కూడా హద్దు ఉంటుంది..విపక్షాలపై కేటీఆర్ విమర్శలు
KTR: ఓపికకు కూడా హద్దు ఉంటుందని, ప్రతిపక్షాలు తిడితే చూస్తూ ఊరుకోవాలా అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.;
KTR: ఓపికకు కూడా హద్దు ఉంటుందని, ప్రతిపక్షాలు తిడితే చూస్తూ ఊరుకోవాలా అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలు అమ్ముతున్నందుకా అని విమర్శించారు.
అటు...టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపైనా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకే.. కొడంగల్ నుంచి ప్రజలు తరిమేశారని అన్నారు. టీ కాంగ్రెస్‌ను చంద్రబాబు ఫ్రాంచైజీలా తీసుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌కు దిక్కు లేక... చంద్రబాబు ఏజెంట్‌ను పీసీసీ అధ్యక్షుడిని చేశారని ధ్వజమెత్తారు.
అటు... టీఆర్‌ఎస్ ఆవిర్భావించి 20ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సెప్టెంబర్ 2న ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని తెలిపారు.