KTR : ఫిర్జాదిగూడలో ఉచిత శిక్షణా సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
స్కిల్స్ ఉంటే యువతకు రాష్ట్రంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్.
KTR : స్కిల్స్ ఉంటే యువతకు రాష్ట్రంలో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు మంత్రి కేటీఆర్. కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఆయన కోరారు. ఫిర్జాదిగూడలో ప్రభుత్వ ఉచిత కోచింగ్ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. ఒకవైపు గవర్నమెంట్ సెక్టార్, మరోవైపు ప్రైవేటు సెక్టార్లు మనకు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటితోపాటు వ్యాపార అవకాశాలు కూడా రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని మంత్రి తెలిపారు. కేంద్రం ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భారీగా ఖాళీలు ఉన్నాయని.. కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలన్నారు. ఆరు నెలలు చదువుమీద దృష్టిపెట్టి మంచి ఉద్యోగాలను సాధించాలని మంత్రి ఆకాంక్షించారు.