3 లక్షల మందికి ఉద్యోగ కల్పనే లక్ష్యం - కేటీఆర్
3లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.;
ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో వచ్చే నాలుగు సంవత్సరాల్లో 3లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎలక్ట్రానిక్ తయారీ రంగంపై సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో 250కు పైగా కంపెనీల్లో ఎలక్ట్రానిక్ రంగంలో లక్షా 60వేల మందికి ఉపాధి కల్పిస్తున్నామన్నారు. వచ్చే నాలుగేళ్లలో 75వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించామన్నారు. ఇక ఎలక్ట్రానిక్ వాహనాల తయారీ రంగ పరిశ్రమలో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేటీఆర్ వెల్లడించారు.