KTR vs Revanth Reddy : ట్విట్టర్ వేదికగా కేటీఆర్, రేవంత్ మాటల యుద్ధం
KTR vs Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా సెటైర్స్ వేశారు.;
KTR vs Revanth Reddy : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనపై మంత్రి కేటీఆర్ ట్వీట్టర్ వేదికగా సెటైర్స్ వేశారు. రాజకీయ పర్యాటకులు వస్తుంటారు... పోతుంటారు.. కేసీఆర్ మాత్రం లోకల్ అంటూ తనదైన శైలిలో పంచ్‌తో ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ డైలాగ్‌కు తగ్గట్టుగా ఉన్న మేనరిజం ఫొటోను కూడా షేర్ చేశారు. ఇక కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ మీకు టూరిస్టు ప్లేసు కావొచ్చు... కానీ కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలమంటూ కౌంటర్ ఎటాక్ చేశారు. మీ వక్రబుద్ధి ప్రకారం తెలంగాణ టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా... దాన్ని సృష్టించింది కూడా కాంగ్రెస్సే అంటూ సెటైర్ వేశారు.
అంతకముందు రేవంత్ రెడ్డి.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్య కూడా ట్విట్టర్ వార్ నడిచింది. రాహుల్‌పై కవిత విమర్శలు చేశారు. రాష్ట్ర హక్కుల కోసం... దేశవ్యాప్తంగా ఒకే వరి కొనుగోలు విధానంపై టీఆర్‌ఎస్ పోరాడుతున్నప్పుడు రాహుల్ ఎక్కడున్నారని ఆమె ట్విట్టర్‌లో ప్రశ్నించారు. దీనికీ రేవంత్ కౌంటర్ ఇచ్చారు. రైతు వ్యతిరేక చట్టాలను మోదీ తెచ్చినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నించారు. మోదీ ముందు కేసీఆర్ మోకరిల్లి... బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని లేఖ ఇచ్చి రైతులకు ఉరితాళ్లు బిగించినప్పుడు మీరెక్కడున్నారని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
కేటీఆర్ గారూ…మీ దృష్టిలో తెలంగాణ ఒక టూరిస్ట్ ప్లేస్ అయి ఉండొచ్చు!
— Revanth Reddy (@revanth_anumula) May 6, 2022
కాంగ్రెస్ దృష్టిలో ఈ రాష్ట్రం అమరవీరుల త్యాగఫలం. నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం. మీ వక్రదృష్టి ప్రకారం ఇది టూరిస్ట్ ప్లేస్ అనుకున్నా…
దానిని సృష్టించింది కూడా కాంగ్రెసే. https://t.co/d3Iv53SYnl