Minister KTR : అత్యాచారానికి గురైన చిన్నారిని పరామర్శించిన మంత్రి కేటీఆర్..!
Minister KTR ; ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమన్నారు మంత్రి కేటీఆర్.;
Minister KTR : ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమన్నారు మంత్రి కేటీఆర్. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ నిలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను, కుటుంబసభ్యుల్ని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. సమాజంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని, నిందితుడు ఎవరైన కఠిన శిక్షపడాల్సిందేనన్నారు. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు మంత్రి కేటీఆర్.