తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి మరో కీలక ప్రకటన చేశారు. వీఆర్‌వోలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందన్నారు. మళ్లీ వారిని తిగిరి విధుల్లోకి తీసుకునేందుకు కసరత్తు ప్రారంభించిందన్నారు. ఓ మీడియా ఛానల్ ప్రతినిధితో వీఆర్‌వోల అంశంపై మాట్లాడారు. గత ప్రభుత్వం వ్యవస్థను ధ్వంసం చేసిందన్నారు. అందుకే వీఆర్‌వో వ్యవస్థను మళ్లీ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని తెలిపారు. ధరణి పోర్టల్ లో అక్రమాల నిగ్గు తేలుస్తామన్నారు.