చెరువులు, కుంటల ఆక్రమణలకు పాల్పడితే ప్రభుత్వం సహించేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న వారి వివరాలను ఎవరైనా అధికారులకు అందజేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటారని తెలిపారు. హైదరాబాద్ పరిధిలో హైడ్రా ఏర్పాటు కాకముందే కరీంనగర్‌లో అక్రమ నిర్మాణాలపై తాము ఉక్కుపాదం మోపామని గుర్తు చేశారు. అక్రమ నిర్మాణలపై ప్రజలకు అనుమానాలుంటే ఆర్టీఐ లాంటి ప్రభుత్వ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. కబ్జాలకు పాల్పడిన వారు ఎంతటి వారైనా సహించేది లేదని.. చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఉపేక్షించబోదని మంత్రి పొన్నం అన్నారు.