Telangana Governor : వరదలు వస్తే ప్రభుత్వం ఉండగా మీకేం పని అని వెళ్లారు : సత్యవతి రాథోడ్
Telangana Governor : గవర్నర్ పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సత్యవతి రాథోడ్
Telangana Governor : గవర్నర్ పదవిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. గవర్నర్ బీజేపీ నాయకురాలిగా మాట్లాడుతోందని మంత్రి ఆరోపించారు. గవర్నర్ తన పని తాను చేసుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ రాజ్‌భవన్ ఎప్పుడు రావాలి అన్నది ఆయన ఇష్టమని ఆమె తెలిపారు. గవర్నర్ పరిధి దాటి బీజేపీ ప్రతినిధిగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలు వస్తే ప్రభుత్వం ఉండగా మీకేం పని అని వెళ్లారని ప్రశ్నించారు.
రాజ్‌భవన్‌కు ఎవరూ రాకుంటే ఫోన్‌లు చేసి మరీ పిలిపించుకుంటున్నారని ఆమె అన్నారు. తెలంగాణ చరిత్ర గవర్నర్‌కు తెలియదని.. అందుకే విమోచనం అంటోందని మంత్రి మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌కు మహిళలపై చాలా గౌరవం ఉందన్నారు. మీకు మీరే సమీక్ష చేసుకోండి.. మీకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో అంటూ గవర్నర్‌కు సూచించారు.